ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళ తనకు ఎదురుగా కూర్చున్న కొందరు అమ్మాయిలను ఉద్దేశించి కామెంట్లు చేసింది. వారిలో కొందరు షార్ట్స్ వేసుకున్నారు. దీంతో వారిని చూసిన ఆ మహిళ వారినుద్దేశించి మాట్లాడుతూ.. షార్ట్స్ వేసుకునే అమ్మాయిలను రేప్ చేయండి.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఆడవాళ్లు ఫలానా దుస్తులే వేసుకోవాలి.. ఫలానా దుస్తులు వేసుకోరాదు.. అని గతంలో కొందరు ప్రముఖులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఆపై నోరు కరుచుకుని మహిళలకు సారీ కూడా చెప్పిన విషయం విదితమే. ఇలాంటి సంఘటనలను గతంలో మనం ఎన్నోసార్లు చూశాం. అయితే ఢిల్లీలో సరిగ్గా ఇలాంటి ఓ ఘటనే తాజాగా చోటు చేసుకుంది. కాకపోతే మహిళల దుస్తులపై కామెంట్లు చేసింది ఎవరో కాదు.. ఓ మహిళనే.. ఆమె వీఐపీ ఏమీ కాదు.. సాధారణ మహిళే. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళ తనకు ఎదురుగా కూర్చున్న కొందరు అమ్మాయిలను ఉద్దేశించి కామెంట్లు చేసింది. వారిలో కొందరు షార్ట్స్ వేసుకున్నారు. దీంతో వారిని చూసిన ఆ మహిళ వారినుద్దేశించి మాట్లాడుతూ.. షార్ట్స్ వేసుకునే అమ్మాయిలను రేప్ చేయండి.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా.. తన ఎదురుగా ఉన్న అమ్మాయిలను చూపిస్తూ.. వీరంతా అత్యాచారం చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా కామెంట్లు చేసింది. దీంతో అక్కడ ఉన్న ఆ అమ్మాయిలు ఆ మహిళ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను రౌండప్ చేశారు.
కానీ ఆ మహిళ అక్కడి నుంచి బయటికి వచ్చి మరో షాప్‌లోకి వెళ్లింది. ఆమె వెంటే వెళ్లిన ఆ అమ్మాయిలు ఆ మహిళ మాట్లాడే మాటలను తమ తమ ఫోన్లలో రికార్డు చేస్తూనే ఉన్నారు. వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆ మహిళపై పోలీస్ కంప్లెయింట్ ఇస్తామని, తాము రికార్డు చేసిన ఆమె వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని ఆ అమ్మాయిలు ఆ మహిళను డిమాండ్ చేశారు. ఆ మహిళ చుట్టూ తిరుగుతూ తాము ఏం తప్పు చేశామో చెప్పాలని అడిగారు.
అయితే ఆ మహిళ.. తాను చేసిన కామెంట్లను సమర్ధించుకుంది. అమ్మాయిలు కొంచెం డీసెంట్‌గా ఉండే డ్రెస్సులు వేసుకోవాలని, పేరెంట్స్ అమ్మాయిలను కంట్రోల్‌లో పెట్టాలని మరిన్ని వ్యాఖ్యలు చేసింది. దీంతో ఓ దశలో గొడవ పెద్దది అయ్యేట్లు కనిపించింది. కానీ చివరకు ఏమైందో తెలియదు. కాకపోతే ఆ మహిళను సదరు అమ్మాయిలు తీసిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ సంఘటన తరువాత సదరు మహిళ ఆ అమ్మాయిలకు సారీ చెప్పిందా, లేదా.. చివరకు ఏమైంది అన్నది మాత్రం తెలియరాలేదు. ఏది ఏమైనా.. మహిళలు వేసుకునే దుస్తులపై ఎప్పుడూ ఎవరో ఒకరు ఇలాంటి కామెంట్లను చేస్తూనే ఉన్నారు. అవి దుమారం రేపుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయో.. వేచి చూస్తే తెలుస్తుంది..!