జగన్ కేబినేట్ లో ఆర్థికమంత్రి ఆయనేనట.. పక్కా అట..!

-

ఒకవేళ ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే… ఆర్థిక మంత్రిగా ఎవరిని తీసుకుంటారు. ఖచ్చితంగా ఆయన్నే తీసుకుంటారని… వైసీపీ నేతలు ఊహించుకుంటున్నారు.

ఏపీలో ఇంకా ఫలితాలే రాలేదు.. అప్పుడు జగన్ కేబినేట్. ఆ కేబినేట్ లో ఆర్థిక మంత్రి ఎవరో కూడా డిసైడ్ చేసేశారా? అని అనకండి. ఎందుకంటే.. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే.

ఒకవేళ ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే… ఆర్థిక మంత్రిగా ఎవరిని తీసుకుంటారు. ఖచ్చితంగా ఆయన్నే తీసుకుంటారని… వైసీపీ నేతలు ఊహించుకుంటున్నారు.

అయితే.. ఏపీలో ఈసారి వైఎస్ జగనే గెలుస్తారని.. సర్వేలు కూడా చెబుతున్న తరుణంలో కేబినేట్ మంత్రులుగా వీళ్లయిలే బాగుంటుంది. జగన్ వీళ్లనే కేబినేట్ మంత్రులుగా తీసుకుంటారు.. అంటూ జోరుగా చర్చ జరుగుతోంది.

అయితే… ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ప్రజలకు హింటిచ్చారు. పలానా ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్లకు ఖచ్చితంగా మంత్రిని చేస్తా అని హామీ ఇచ్చారు. కొంతమంది విషయంలోనే ఆయన హామీ ఇచ్చారు. అందరి విషయంలో ఇవ్వలేదు. ఎవరి సంగతి ఎలా అన్నా ఉండనీయండి.. కానీ.. ఏపీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. ఏపీ ఆర్థిక మంత్రి.. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అట. అవును ఈ విషయాన్ని వైసీపీ వర్గాలే కన్ఫమ్ చేశాయి.

ఎందుకు జగన్.. రాజేంద్రనాథ్ రెడ్డినే ఆర్థిక మంత్రిగా ఎంచుకుంటారు.. అంటే దానికీ కారణం లేకపోలేదు. రాజేంద్రనాథ్ రెడ్డి.. జగన్ కు అత్యంత సన్నిహితుడు. వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.

ఆర్థిక మంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి. అందుకే… ఈ శాఖను ఖచ్చితంగా బుగ్గనకే జగన్ కట్టబెడతారని తెలుస్తోంది. అయితే.. ఈ శాఖ కోసం చాలామందే వెయిటింగ్ లిస్టులో ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version