కరోనా ఎఫెక్ట్‌! గోమూత్రం రూ.500.. ఆవుపాలు రూ.150

-

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ ఎన్నో రకాల వ్యాపారాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నది. కానీ, ఒక వ్యాపారానికి మాత్రం ఈ కరోనా ప్రభావం బాగా కలిసొచ్చింది. ‘ఇంతకూ అది ఏం వ్యాపారం?’ అనేగా మీ సందేహం! అది మూత్రం వ్యాపారం! అవును గో మూత్రం వ్యాపారం! దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో జనం గో మూత్రం కొనేందుకు కొన్ని చోట్ల క్యూలు కడుతున్నారట. కరోనాకు, గోమాత్రానికి ఏమిటి లింకు అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే..

కరోనా వైరస్‌ అందరిలో ఒకే తీరుగా ప్రభావం చూపదట. రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉన్న వారిలో కరోనా ఆటలు అస్సలు సాగవట. కానీ రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో మాత్రం కరోనా శరవేగంగా విస్తరించి ప్రాణాలు తీస్తుందట. అందుకే జనం రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మంచి పోషకాలు ఉన్న ఆహారం, పండ్లు తీసుకుంటున్నారు. అది సరే..! మరి గోమూత్రం సంగతి ఏమిటి అనుకుంటున్నారా? వస్తున్నా.. అక్కడికే వస్తున్నా.

గోమూత్రానికి కూడా మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచే ఒక అద్భుతమైన లక్షణం ఉందట. రోజూ గోమూత్రాన్ని తాగితే రోగనిరోధకశక్తి అమాంతం పెరిగిపోతుందట. మరి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారిని కరోనా ఏం చేయలేదు కదా! అందుకే జనం గోమూత్రం కొనేందుకు మొగ్గుచూపుతున్నారట. దీంతో చెంబుల కొద్దీ గోమూత్రం చకాచకా అమ్ముడు పోతున్నదట. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాకు చెందిన మభూద్‌ అలీ అనే పాల వ్యాపారి కూడా ఓ వైపు ఆవు పాలు, మరోవైపు ఆవు మూత్రం అమ్ముకుంటూ తెగ సొమ్ముచేసుకుంటున్నాడట.

ప్రజల నుంచి డిమాండ్‌ బాగా పెరిగిపోవడంతో ఆవు మూత్రం ధర అమాంతం పెరిగిపోయిందని మభూద్‌ అలీ చెబుతున్నాడు. లీటర్‌ ఆవు మూత్రం రూ.500 పెట్టి కొనేందుకు కూడా జనం ఏ మాత్రం వెనుకాడటం లేదంటున్నాడు. ‘ఇన్నాళ్లూ నాకు ఆవు పాల ద్వారా మాత్రమే డబ్బులు వచ్చేవి. ఇప్పుడు పాలతోపాటు మూత్రానికి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో పాల అమ్మకం ద్వారా వచ్చే లాభం కంటే రెట్టింపు మూత్రం అమ్మకం ద్వారా వస్తుంది’ అని పాల వ్యాపారి మభూద్‌ అలీ సంతోషం వ్యక్తంచేశాడు.

జనం నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా మభూద్‌ ఆవు మూత్రం విక్రయించేందుకు దుకాణమే ఓపెన్‌ చేశాడట. అంతేకాదు ‘ఆవు మూత్రం తాగండి.. కరోనా వైరస్‌ను అరికట్టండి’ అంటూ దుకాణం ముందు ఒక బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడట. దీంతో జనం ఆయన దుకాణం ముందు క్యూలో నిలబడి మరీ ఆవు మూత్రం కొనుగోలు చేస్తున్నారట. ఆవు మూత్రం రూ.500కు అమ్ముడు పోతుంటే, ఆవు పాలు మాత్రం ఎప్పటిలాగే రూ.150 ధర పలుకుతున్నాయట. చూశారుగా ఎప్పుడు దేనికి విలువ పెరుగాలో.. తగ్గాలో కాలమే నిర్ణయిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news