పోలీసుల వేధింపులు.. కోర్టులో కమల్ పిటీషన్‌

-

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో ఇండియన్ 2 (భారతీయుడు 2) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే గత నెలలో జరిగిన ఇండియన్ 2 సెట్ ప్రమాదం అందరికీ షాక్‌కు గురి చేసింది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కోలీవుడ్, టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది.

ఇండియన్ 2 ప్రమాదంపై కోలీవుడ్ భిన్నరకాలుగా స్పందించింది. ఈ ఘటనలో రాజకీయ నాయకులు ఎంటర్ కావడంతో పూర్తి స్వరూపమే మారిపోయింది. కమల్ హాసన్, నిర్మాణ సంస్థ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా కమల్ హాసన్ పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాడు.

అయితే తాజాగా పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని కమల్ హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో పిటీషన్ వేశాడు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తనను టార్గెట్ చేస్తున్నారనటి చేసిన పిటీషన్‌కు న్యాయస్థానం స్పందించి.. విచారణ నుంచి కమల్ హాసన్‌ను మినహాయించినట్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news