పీచు మిఠాయి దేశం మొత్తం బ్యాన్ చేయాలని డిమాండ్!

-

పీచు మిఠాయి అంటే పిల్ల‌లు ఎగిరి గంతులేస్తారు. ఈ మిఠాయిని తినేందుకు పెద్ద‌లు కూడా ఆస‌క్తి చూపుతారు. అలా నోట్లో వేసుకోగానే క‌రిగిపోతోంది పీచు మిఠాయి. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఇష్టంగా తినే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు, పుదుచ్చేరి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. పీచు మిఠాయి విక్ర‌యాల‌పై నిషేధం విధించారు.

పీచు మిఠాయి లో స్వచ్ఛతను కోల్పోకుండా, రంగురంగుల్లో ఉండేందుకు రోడమైన్-బి కలిగి ఉన్న పీచు మిఠాయిని దేశం మొత్తం బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పింకు రంగు కోసం వాడే రోడమైన్-B వల్ల తక్షణమే దురద, శ్వాస సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ రంగు 60 రోజుల పాటు శరీరంలోని మూత్రపిండాలు, కాలేయం, పేగుల్లో పేరుకుపోయి శరీరభాగాలను దెబ్బతీస్తుందట. బ్యాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news