ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించాలన్నారు మంత్రి సీతక్క. జాతీయ ఉత్సవానికి కావాల్సిన అర్హతలు మేడారం జాతరకు ఉన్నాయని అన్నారు.మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
ములుగు జిల్లా మేడారం జాతర ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,సీతక్క, కొండా సురేఖ, ఫిబ్రవరి 19న వనదేవతలను దర్శించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని వెల్లడించారు.అంతకుముందు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేసి పగిడిద్దరాజు పూజారులకు కొత్త బట్టలు, డోలీలు అందజేశారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.