అకౌంట్‌లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్‌ చేసి పారిపోయిన ఉద్యోగి.

-

సాఫ్ట్‌వేర్‌ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో డబ్బు జమ చేసింది. మన అకౌంట్‌లో అంత డబ్బు పడిందని మనకు తెలుసుకునే లోపే.. బ్యాంకులు అవి తీసేసుకుంటాయి. ఆ టైంలో వార్త విన్న వాళ్లందరికి ఛా.. మన అకౌంట్‌లో పడితేనా..వెంటనే తీస్తుండే..అని తెగ ఫీల్‌ అవుతాం..ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.. అయితే మనోడు బ్యాంక్‌ వాళ్లకంటే త్వరగా తేలుకున్నాడు..శాలరీ పడాల్సిన దానికంటే.. కొన్ని వందల రెట్లు ఎక్కువ జమ అయింది. అంతే తెలివిగా ఆలోచించి..తప్పించుకున్నాడు..ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ అనే చిలీ(Chili) అతిపెద్ద కోల్డ్ కట్స్ నిర్మాత కంపెనీలో జరిగింది. డబ్బు తీసుకుని పారిపోయిన ఉద్యోగి జాడ లేకపోవడంతో ఇక్కడి కంపెనీ హెచ్ఆర్‌ అయోమయంలో పడింది. ఆహార వ్యాపార సంస్థ కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్‌లో పనిచేస్తున్న ఉద్యోగి జీతం ప్రతి నెలా 500,000 పెసోలు అంటే మన కరెన్సీలో దాదాపు 43 వేల రూపాయలు. కంపెనీ పొరపాటుగా ఈ ఉద్యోగికి అతని జీతం కంటే 286 రెట్లు అంటే 165,398,851 చిలీ పెసోలను ఈ ఉద్యోగి ఖాతాలో జమ చేసింది. అంటే.. దాదాపు 1.5 కోట్లు ఉంటుంది.

ఈ డబ్బు ఖాతాలో చేరడంతోనే సదరు వ్యక్తి మొదట ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బు మళ్లీ కంపెనీకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అనుకున్నాడేమో.. ఆ మొత్తం సొమ్ముతో ఉడాయించేందుకు ప్లాన్‌ వేసాడు..ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయాడు. ఇప్పటి వరకు అతడు జాడ లేకపోవడంతో కంపెనీ న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఈ ఘటన మే 30న జరిగింది.

కంపెనీలో పనిచేస్తున్న డిప్యూటి మేనేజర్‌ విషయం తెలుసుకుని ఉద్యోగి దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా..మరుసటి రోజు వచ్చి డబ్బు తిరిగి ఇస్తాను అని చెప్పాడట. కంపెనీ వాళ్లు అతని రాక కోసం చూశారు..కానీ ఉద్యోగి రాలేదు. మళ్లీ సదరు ఉద్యోగిని సంప్రదిస్తే..అతను అదృశ్యమైనట్లు తెలిసింది. తన రాజీనామా లెటర్‌ను ఆఫీస్‌కు పంపించి ఉద్యోగి పరార్‌ అయ్యాడు. కంపెనీ ఇప్పుడు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news