తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కామారెడ్డి, మల్కాజ్గిరి, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భూపాలపల్లి, జనగాం, గద్వాల్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, సూర్యాపేట, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, కరీంనగ,ర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిన్నటి నుంచి పలు ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.