చెప్పు దెబ్బలు తినడానికి నేను రెడీ – డిప్యూటీ సీఎం నారాయణస్వామి

-

చెప్పు దెబ్బలు తినడానికి నేను రెడీ అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్వేటినగరం పెద్ద దళిత వాడ గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు పై హాట్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏం దేశానికి సేవ చేయలేదు..జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలుసుకున్నాడని ఫైర్‌ అయ్యారు.

పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిట్టాడు.. ఇద్దరు ఒకరికొకరు తిట్టుకున్న వాళ్లేనని గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఒకటి అయ్యారు.. ఇక్కడ జరిగిందాన్ని వీడియో తీసి పెడితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పకపక నవ్వుకునేదన్నారు. నేను పూలమాల వేసుకునే దానికే కాదు.. చెప్పు దెబ్బలు తీసుకునే దానికి కూడా నేను రెడీ అంటూ సవాల్‌ చేశారు. నేను తప్పు చేయనని…నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోనన్నారు. ఇలాంటి వాటికి నేను భయపడేది లేదు.. అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news