భారత మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ

-

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుమారులు, అనుచరుల నుండి నన్ను, నా ఇంటిని కాపాడండంటూ భారత మహిళ ఏ జట్టు క్రికెటర్ రంజీ ప్లేయర్ శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుమారుడు రమేశ్వర్ గౌడ్ మరోసారి భూ వివాదంలో చిక్కుకున్నాడు. అధికారం అడ్డం పెట్టుకొని మహిళ క్రికెటర్ పై దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. గత 35 సంవత్సరాలు గా మేనమామ ఇచ్చిన ఇంట్లో క్రికెటర్ శ్రావణి ఉంటోంది.

మేనమామ చనిపోయిన తర్వాత మేనమామ కుమారులు.. ఆమెపై రౌడీ ఇజం చేయడం మొదలు పెట్టారు. ఇంట్లో నుండి వెళ్లిపోవాలంటూ పలు మార్లు రంజీ ప్లేయర్ శ్రావణిని బెదిరించారు మేనమామ కుమారులు. అయినప్పటికీ… రంజీ ప్లేయర్ శ్రావణి… ఇంటి నుండి బయటకు వెళ్లకపోవడం తో పద్మారావు కుమారుడు రమేశ్వర్ గౌడ్ ఎంట్రీ ఇచ్చాడు. పద్మారావు గౌడ్ ఆఫీస్ కు పిలిపించి.. రమేశ్వర్ గౌడ్‌ బెదిరించాడని బాధితురాలు ఆరోపణలు చేస్తున్నారు.

రూ. 2 లక్షలు తీసుకొని సెట్టిల్ చేసుకోవాలి అని రామేశ్వర గౌడ్ చెప్పాడు అంటూ బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. జిహెచ్ఎంసి అధికారులతో  తన ఇంటిని కూల్చివేయించారని చెబుతోంది. దీనిపై ఇప్పటివరకు బాధితురాలు…. పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.. మీడియా ముందుకు రాలేదు. దీంతో బాధితురాలి ఆరోపణలు వివాదస్పదంగా మారాయి. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version