బ్యూటీ స్పీక్స్ : అందం డేంజ‌ర్ అమ్మాయి డేంజ‌ర‌స్ ?  

-

“మా ఇష్టం DANGEROUS సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను” – rgv

లెస్బియ‌న్ క‌ల్చ‌ర్ పై తొలిసారి సినిమా తీశారు ఆర్జీవీ. ఎప్పుడూ సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేసే ద‌ర్శ‌కులు ఈయ‌న. తెలుగులో మా ఇష్టం అని అంటున్నారు. ఇంగ్లీషులో డేంజ‌ర‌స్ అని కూడా ఓ ట్యాగ్ ఇచ్చారు. టైటిల్ ఎలా ఉన్నా.. రామూ మాత్రం డేంజ‌ర‌స్..ఆయ‌న ఆలోచ‌న‌లు ఇంకాస్త డేంజ‌ర‌స్. అయినా కావొచ్చు. కాకుండా పోనూవ‌చ్చు. ఓత‌గాదా కార‌ణంగా నిర్మాత న‌ట్టి కుమార్ తో ఆర్థిక బంధాలు చెడిన కార‌ణంగా ఇవాళ సినిమా విడుద‌ల‌పై సందేహాలు ఉన్నాయి. సిటీ కోర్టు ఇచ్చిన ఆదేశానుసారం సినిమా విడుద‌ల‌పై కొన్ని అనుమాన‌పు మేఘాలు ఆవృతం అయి ఉన్నాయి. ఈ సినిమా గోల ఎలా ఉన్నా గోడు ఎలా ఉన్నా అందం డేంజ‌ర్ అవుతుందా ? ఓ చ‌ర్చ‌కు తెర తీద్దాం రండి !

అమ్మాయిలు అంతా ఎలా ఉన్నారు అన్న ఆరా తీశాను మొన్న. సంస్కృతికి విరుద్ధంగా కొంద‌రు ఉన్నారు. సంస్కృతి పాటింపులో భాగంగా ఉన్నారు ఇంకొంద‌రు. న‌చ్చింది తింటాం న‌చ్చిన విధంగా ఉంటాం అని చెబుతున్నారు. అంటే అలా ఉంటే ఏమీ అన‌కూడ‌దు అని కూడా ఓ రూలింగ్ ఇచ్చారు. అలాంట‌ప్పుడు అమ్మాయిలు ఎందుక‌ని కామెంట్స్ ను త‌ట్టుకోలేక‌పోతున్నారు.

స్వేచ్ఛ అన్న‌వి విశృంఖ‌ల రీతిలో వినియోగం కాకూడ‌దు. కానీ ఇక్క‌డ స్వేచ్ఛ కూ ప‌రిమితం అయిన ప‌రిధి ఉంటే, అప్పుడు అమ్మాయిలయినా అబ్బాయిలు అయినా జాగ్ర‌త్త‌గా న‌డుచుకోవ‌డం ఖాయం.ఆ విధంగా ప‌రిమిత స్వేచ్ఛ కు త‌ల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. క‌నుక అమ్మాయిలు డేంజ‌ర‌స్ అవుతున్నారు. టూ మ‌చ్ చేస్తున్నారే ! అని కూడా రాయొచ్చు.

ప‌బ్బుల్లో ఉండ‌డం, క్ల‌బ్బుల్లో ఉండడం కూడా స్టేట‌స్ సింబ‌ల్ ఇప్పుడు వాళ్ల‌కు ! ఇర‌వై ఏళ్లు కూడా నిండ‌ని ఓ వ‌ర్థ‌మాన న‌టి ప‌బ్బుల్లో క‌నిపించి పోలీసుల‌కు దొరికిపోయింది.అయినా ఆ పిల్ల మాట‌లో ప‌శ్చాత్తాపం లేదు. ఏ కోశానా త‌ప్పు చేశాను అన్నభా వ‌న లేదు. భాగ్య‌న‌గ‌రంలో బంజారాహిల్స్ , రాడిస‌న్ హోట‌ల్ లో  మొన్న‌టి వేళ పోలీసులు జ‌రిపిన రైడ్ లో ఎన్నో విషాద‌క‌ర
చిత్రాలు వెలుగు చూశాయి. అయినా కూడా ఎవ్వ‌రిలోనూ ఏ పాప భీతి కూడా కాన‌రాలేదు. క‌నుక అమ్మాయిలు డేంజ‌ర‌స్..వారి అందం కూడా డేంజ‌ర్.
అందం ఎందుకు డేంజ‌ర్ అంటే.. దానినే అడ్డు పెట్టుకుని ఒక విధం అయిన ఊహా లోకంలో ఉంటూ బ‌తుకుతున్నవారు ఎంద‌రో ! అందాన్ని కాపాడుకునే క్ర‌మంలో వికృతాల‌కు ప్రాధాన్యం ఇస్తున్న వారు కొంద‌రు. అందం పోతుంద‌ని బిడ్డ‌ల‌కు పాలు కూడా ఇవ్వ‌ని వారు కూడా కొంద‌రు ! అంతా కాదు కొంద‌రు. మ‌ళ్లీ అంద‌రి మ‌హిళ‌ల మ‌నోభావాలూ దెబ్బ తింటే ఏం చేయ‌డం ?
ఏం చేయ‌గ‌లం ? క‌నుక  ఆధునిక కాలంలో బ్యూటీ కాన్ష‌స్నెస్ పెరుగుతుంది..తెలుగులో అయితే అందంపై యావ. అందాన్ని కాపాడుకోవాల‌న్న ధ్యాస. కొన్ని సార్లు అదే అత్యుత్సాహం కూడా ! స‌న్న‌గా ఉండేందుకు జీరో సైజు మెంటైన్ చేసేందుకు కూడా !

ఇవే సినిమాల వైపు ఇంకా ఇత‌ర అవ‌కాశాల వైపు మొగ్గు చూపే కోరిక‌ల‌కు కార‌ణం అవుతున్నాయి. వాస్త‌వానికి సినిమాల్లోనో , సీరియ‌ళ్ల‌లోనో  క‌నిపించ‌కూడ‌ద‌ని కాదు త‌రువాత వారి జీవితం  ఎటువంటి మార్గం వైపు వెళ్తుంది అన్న‌దే కీల‌కం. వెలుగు నుంచి చీక‌టి లోగిళ్ల‌లోకి వెళ్లిపోతోంది. ప‌బ్ క‌ల్చ‌ర్ పార్టీ క‌ల్చ‌ర్ కు ఆక‌ర్షితులైన యువ‌తులు తాము చెడింది కాకుండా ప‌క్క‌నున్న వారినీ చెడ‌గొడుతున్నారు. వారి జీవితాల‌నూ త‌మ‌కు తెలియ‌కుండానే నాశ‌నం చేస్తున్నారు. క‌నుక అందంగా ఉండ‌డం క‌న్నా ఆత్మ‌విశ్వాసంతో ఉండ‌డం అమ్మాయిల‌కు ఉండాల్సిన ల‌క్షణం. తిరుగుబాటు కూడా మంచిదే కానీ ప‌నికిమాలిన విష‌యాల‌పై కాకుండా జీవితాన్ని ఉన్న‌త స్థితికి తీసుకువెళ్లే విష‌యాల‌కు సంబంధించి అడ్డొచ్చిన వాటిని అధిగ‌మించడం కూడా
ఓ గొప్ప తిరుగుబాటుకు ఉండే ప్రాథ‌మిక గుణం లేదా ల‌క్ష‌ణం. ఇవేవీ కాకుండా మా ఇష్టం మీరెవ్వ‌రు అడగడానికి అంటే ఏం చేయ‌లేం..ఏం చెప్ప‌లేం కూడా !

– బ్యూటీ స్పీక్స్ – మ‌న లోకం ప్ర‌త్యేకం 

Read more RELATED
Recommended to you

Exit mobile version