గర్భంతో ఉన్నా సరే ఆఫీసులో అర్ధరాత్రి వరకు బిజీగా పని చేసి ఉదయాన్నే ప్రసవించిన మేయర్…!

Join Our Community
follow manalokam on social media

రాజస్థాన్ రాజధాని జైపూర్ నగర్ నిగమ్ (గ్రేటర్) మేయర్ డాక్టర్ సోమ్య గుర్జార్ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షించారు. తన కుమారుడు పుట్టడానికి కొన్ని గంటల ముందు బుధవారం అర్థరాత్రి వరకు పనిచేసారు ఆమె. గురువారం ఉదయం ఒక పసికందుకు జన్మనిచ్చారు. ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో సోమ్య గుర్జర్ ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పారు. ఈ వార్త సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయింది.

సోమ్య గుర్జార్ తన పోస్ట్‌లో బుధవారం అర్థరాత్రి వరకు కార్యాలయంలో సమావేశంలో బిజీగా ఉన్నా అని చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెను జైపూర్‌లోని కోకన్ ఆసుపత్రిలో చేర్పించగా… గురువారం తెల్లవారుజామున ఒక పసికందును ప్రసవించారు. నిగమ్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు సమావేశం నిర్వహించాను. తెల్లవారుజామున 12:30 గంటలకు కోకన్ ఆసుపత్రిలో చేరాము అని పేర్కొన్నారు.

దేవుని దయవల్ల ఉదయం 5:14 గంటలకు ఒక పసికందును ప్రసవించా అని ఆమె తెలిపారు. శిశువు మరియు నేను ఇద్దరూ బాగున్నాము అని సోమ్య గుర్జర్ అన్నారు. ఈ పోస్ట్ కి చాలా మంచి స్పందన వస్తుంది. ఇద్దరూ సంతోషంగా ఉండాలని, మీకు మీ విధుల మీదున్న శ్రద్ధ నిజంగా అభినందనీయం అని కామెంట్స్ చేస్తున్నారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....