టాలెంట్ ఉన్నప్పటికీ.. అదృష్టం కలిసి రాని కమెడియన్ ఈయనే..!

-

సినిమా ఇండస్ట్రీలో చాలామంది తమ టాలెంట్ తో ముందుకు కొనసాగుతుంటే.. అయితే ఆ టాలెంటును కొంతమంది దర్శకనిర్మాతలు గుర్తించగా వారికి అవకాశాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే ఒళ్లంతా కామెడీ.. అదిరిపోయే పంచులతో అద్భుతమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను నవ్వించే మహా అద్భుతమైన టైమింగ్ ఉన్న అది కొద్ది మందికి కూడా సరైన టైంలో బ్రేక్ రాదు. అలాంటి ఒక కమెడియన్ లో తెరకు దొరికిన ఒక ఆణిముత్యం నటుడు సత్య. అమలాపురంలో పుట్టి పెరిగిన సత్య బీటెక్ పూర్తి చేశాడు. సినిమాలో నటించాలని కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన సత్యాకి మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే అవకాశం లభించింది.

అలా జే. కరుణ్ కుమార్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ద్రోణ సినిమాకు 2009లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, ఆ తర్వాత అమృతం వంటి సీరియల్స్ కి కూడా సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత నిఖిల్ హీరోగా వచ్చిన కళవర్ కింగ్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన కమెడియన్ గా మారి పిల్ల జమిందార్ సినిమాలో పులకేసి పాత్రలో చక్కగా నటించాడు. ఇక అక్కడ నుంచి వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలా చలో, కార్తికేయ, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలలో మంచి టైమింగ్ ఉన్న కామెడీతో నవ్వించాడు. ఇక 2009 నుంచి 2022 వరకు దాదాపు 80 సినిమాలలో కమెడియన్ గా నటించిన సత్య మరికొన్ని సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి వస్తున్నాడు.

టాలీవుడ్ లో సీనియర్ కమెడియన్ అతి తక్కువ కాలంలో చనిపోవడంతో కమెడియన్స్ కొరత ఏర్పడింది. బ్రహ్మానందం లాంటి కమెడియన్స్ కూడా రిటైర్ అవ్వడం.. వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉన్న కారణంగా సత్య లాంటి నటులకు అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ సరైన పాత్ర ఒకటి కూడా పడలేదనేది అందరి అభిప్రాయం. ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తికి ఒక బ్రేక్ కూడా రాకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news