కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం.. ఖమ్మం జిల్లా కార్యదర్శి ఇకలేరు

-

తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్(60) కన్నుమూశారు. బుధవారం ఉదయం ఖమ్మంలోని మినీ ట్యాంక్ బండ్‌‌లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. పోటు ప్రసాద్ కమ్యూనిస్టుగా సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు.విషయం తెలిసిన వెంటనే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు స్పందించారు. ప్రసాద్ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు వెల్లడించారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. ప్రసాద్ మృతి పట్ల స్థానిక నేతలు కూడా నివాళ్లు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version