గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసురుతున్నారు. బీజేపీ నాయకులు, ముఖ్యమంత్రుల వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తున్నారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కూడా కేసీఆర్ తగ్గగేదే లే.. అంటూ విమర్శనాస్త్రాలను సందిస్తున్నారు. బీజేపీని ఎదుర్కొవడానికి దేశం వ్యాప్తంగా పర్యటిస్తానని అన్నారు. అవసరం అయితే జాతీయ పార్టీ అయినా… ఫ్రంట్ అయినా.. ఏర్పాటు కూడా సిద్దం అని ప్రకటించారు.
దీంతో కేసీఆర్ కు ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు వస్తుంది. బీజేపీపై కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తాజా గా మాజీ ప్రధాని జనతా దల్ ( సెక్యులర్ ) పార్టీ చీఫ్ హెచ్ డీ దేవెగౌడ మద్దతు ప్రకటించారు. కాసేపటి క్రితం ఆయన కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. మత తత్వ శక్తుల మీద కేసీఆర్ చేస్తున్న పోరాటం అద్భుతం అని కొనియాడారు.
దేశ లౌకిక వాద సంస్కృతిని, దేశాన్ని బీజేపీ నుంచి కపాడటానికి అందరం అండగా ఉంటామని ప్రకటించారు. బీజేపీపై యుద్దం కొనసాగించాలని కేసీఆర్ కు సూచించారు. తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగ తాను బెంగళూర్ కు వస్తానని.. సమావేశం అవుతానని దేవెగౌడతో కేసీఆర్ తెలిపారు.