బీజేపీతో పొత్తుపై దేవేగౌడ కీలక వ్యాఖ్యలు

-

బీజేపీతో పొత్తుకు సై అని, ఎన్డీయేలో చేరడంపై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ స్పందించారు. తమకు అధికార దాహం లేదని, అలాగే అవకాశవాద రాజకీయాలు చేయమన్నారు. తమ పార్టీ లౌకిక ప్రమాణాలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైనార్టీలను ఎన్నటికీ నిరాశపరచమని చెప్పారు. కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించామన్నారు. గత పదేళ్లలో తొలిసారి హోంమంత్రితో చర్చించినట్లు చెప్పారు. పార్టీని కాపాడుకునే లక్ష్యంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు.

బీజేపీతో పొత్తును వ్య‌తిరేకిస్తూ ఇద్ద‌రు జేడీ(ఎస్‌) నేత‌లు ఇప్ప‌టికే రాజీనామా చేయ‌గా, ప‌లువురు ముస్లిం నేత‌లు పార్టీని వీడ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోవైపు క‌ర్నాట‌క‌లో క‌మ‌లం క‌కావిక‌లం కావ‌డంతోనే జేడీ(ఎస్‌)తో బీజేపీ చేతులు క‌లిపింద‌ని, ఇరు పార్టీలు ఒక్క‌టైనా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ సత్తా చాటుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం పతనం కావడానికి కారణమెవరు? అని దేవేగౌడ ప్రశ్నించారు. రాహుల్ ఇక్కడకు వచ్చి తమను బీజేపీకి బీ-టీమ్ అంటారని, ఇది తనకు కాంగ్రెస్ ఇచ్చిన సర్టిఫికెట్ అన్నారు. దశాబ్దాలుగా ప్రజల కోసం పోరాడుతోన్న ఈ పార్టీని కాపాడుకోవాల్సి ఉందన్నారు. అంతే తప్ప అవకాశవాద రాజకీయాల కోసం, అధికార దాహంతో పొత్తు పెట్టుకోలేదన్నారు. తాము సంక్షోభంలో ఉన్నామని, పార్టీని కాపాడుకోవాలన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version