బ్రేకింగ్ : దేవినేని ఉమా అరెస్ట్

Join Our Community
follow manalokam on social media

విజయవాడ శివారు గొల్లపూడి సెంటర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న బడిత పూజ చేస్తానంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఈరోజు దీక్షకు పిలుపునిచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారంటూ దీక్షకు అనుమతి లేదని పోలీసులు ముందే ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం దీక్షా స్థలం దగ్గరికి వచ్చిన దేవినేని ఉమ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనే విషయం మాత్రం తెలియడం లేదు.

అయితే మంత్రి దేవినేని ఉమాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనంలో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుండగా ఆ వాహనానికి టిడిపి కార్యకర్తలు అడ్డంగా కూర్చున్నారు. వాహనాన్ని అక్కడి నుంచి కదలనివ్వకుండా వారు భైతాయించినట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ నుంచి కూడా చాలా మంది టిడిపి సానుభూతిపరులు దీక్ష స్థలం వద్దకు చేరుకుంటున్నారని సమాచారం అందుతోంది. మొత్తంమీద గొల్లపూడి సెంటర్ లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఉన్నాయి. టీడీపీ శ్రేణులు కూడా భారీగా అక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. దేవినేని ఉమా మాత్రమే కాకుండా చాలా చోట్ల టిడిపి నేతలని హౌస్ అడ్రస్ కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు.

TOP STORIES

సంస్కృతం నేర్చుకోవాల‌నుకునే వారి కోసం.. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త యాప్‌..!

సంస్కృతం భాష‌ను దైవ భాష అంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ భాష నుంచే అనేక భార‌తీయ భాష‌లు వ‌చ్చాయ‌ని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్ర‌స్తుత...