సజ్జల, కొడాలి మధ్య వాటాల తేడా.. అందుకే రైడ్స్ : దేవినేని ఉమా 

ఏపీలో పేకాట క్లబ్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొడాలి నాని నియోజకవర్గంలోనే ఆయన సొంత అనుచరుల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు రన్ కావడం సంచలనంగా మారింది. తాజాగా ఈ అంశం మీద టీడీపీ సీనియర్ నేత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బిజినెస్ మెన్, భరత్ అనే నేను సినిమాలు చూడటం కాదు, జగన్ అనే నేను అని ప్రమాణం చేసావు కదా దమ్ము, ధైర్యం ఉంటే పేకాట రాయుడ్ని బర్తరఫ్ చెయ్యండి జగన్మోహన్ రెడ్డి అని ఉమా డిమాండ్ చేశారు. జగన్ గుడివాడ సంక్రాంతి సంబరాలకు వచ్చి శిబిరాలను ప్రోత్సహించారు.

19 నెలలుగా  మంత్రి కొడాలి నాని, అతని అనుచరుడు దొండపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు  మురళీ ఆధ్వర్యంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రోత్సాహంతోనే ఒక బాధ్యత గల మంత్రి ఈ రకంగా బూతులు మాట్లాడుతూ యంత్రాంగాన్ని భయపట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. 42 లక్షలు దొరికాయని డిఎస్పీ, 55 లక్షలు దొరికాయని ఎస్పీ చెప్తున్నారు. మిషన్లతో లెక్కించిన గోనెసంచుల్లో పట్టబడ్డ డబ్బులన్నీ తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్లాయా ? అని అయన ప్రశ్నించారు. సజ్జలకు, కొడాలికి  వాటాల్లో తేడా వచ్చే సరికి పేకాట శిబిరాలు బయటకు వచ్చాయా అని అయన ప్రశ్నించారు.