భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము భక్త జన సందోహంగా మారింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ఉదయం నుంచి కోనేరులో స్నానాలు చేసి, శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు,అర్చన,ప్రత్యేక పూజలు, పట్నాలు, ఒడిబియ్యం, స్వామివారికి తల నీలాలు సమర్పించడం, గంగరేగు చెట్టువద్ద ముడుపులు చెల్లించుకున్నారు. నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఒగ్గు కళాకారులు ఆలయ ప్రాంగణం హోరెత్తింది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి జాతర మొదలై ఉగాది వరకు మల్లన్న జాతర అత్యంత ఘనంగా జరుగుతుంది.