ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అంటూ బాల్క సుమన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ..నిన్ననే సుప్రీంకోర్టు ఆయనకు ఆ కేసులో నోటీసు కూడా ఇచ్చిందని చురకలు అంటించారు. ఆయననే ఒక క్రిమినల్ అయినప్పుడు ఆయననుంచి ఇంతకంటే గొప్పగా ఏమి ఆశిస్తాము….ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైందన్నారు.
ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయాలని కోరారు. నేను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన అని కేసులు పెడుతున్న ప్రభుత్వం మరి మా ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పైన ఆయన చేసిన వ్యాఖ్యల పైన కూడా కేసులు పెట్టాలని పేర్కొన్నారు.
కేసులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారన్నారు. ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు ఇవ్వడం జరిగిందని వివరించారు.