శబరిమళకు పోటెత్తిన భక్తులు..దర్శనాలకు వెళ్లే వారు ఇలా చేయాలి !

-

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో దాదాపు 12 గంటల పాటు క్యూలైన్ లలోనే భక్తులు పడిగాపులు కావాల్సి వస్తోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో నిమిషానికి 80 మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో పార్కింగ్ ప్రాంతాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది.

సన్నిధానం నంద పంథల్ ప్రాంతాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో దర్శన సమయాన్ని కూడా దేవస్థానం బోర్డు 19 గంటల వరకు పొడిగించింది. రద్దీని తగ్గించడానికి వీలుగా వర్చువల్ క్యూ సిస్టమ్ లో బుకింగ్స్ పై పరిమితులు పెట్టారు. పంప నది నుంచి శబరిమల మార్గమంతటా రద్దీ ఉన్నందువల్ల పులిమేడు దారిని ఎంచుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు అధికారులు.

ఇక అటు భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. శబరిమలలో దర్శన సమయం మరో గంట పాటు పొడిగించింది. అభిషేకం విశేష పూజల నిడివి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అయ్యప్ప దర్శనానికి వస్తున్న వృద్ధులు, కన్నె స్వాములకు ఆహార సదుపాయాలు అందజేస్తున్నారు. ఇక ఆన్ లైన్ ద్వారా రోజు వారి దర్శన టికెట్లను 90 వేలకు పరిమితం చేసింది. ట్రావెల్ కోర్ బోర్డ్ తద్వారా భక్తుల రద్దీని తగ్గించవచ్చునని భావించింది.

దర్శనాలకు వెళ్లే భక్తులకు అలర్ట్,

దర్శనాల కోసం భక్తులు ఆన్లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని దేవస్థానం తెలిపింది. 41 రోజుల పాటు జరిగే మండల పూజ ఉత్సవాలు డిసెంబర్ 27న ముగిసిపోతాయి. జనవరి 14, 2023న మకర జ్యోతి తీర్థ యంత్రం కోసం మళ్లీ డిసెంబర్ 30న ఆలయం దేవాలయాన్ని తెరుస్తారు. https://sabarimala.kerala.gov.in/ ను శబరికి వెళ్లే వారు సంప్రదించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news