విద్యార్థుల కోసం జూ లో సమ్మర్ స్పెషల్ ఆఫర్..

-

వేసవి సెలవులను మరింత ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా గడపాలని భావిస్తున్న విద్యార్థులకు హైదరాబాద్‌లోని జూపార్క్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మే నెలంతా ప్రత్యేకంగా ‘జూ టూర్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు జూలోని అన్ని రకాల జంతువులు, పక్షులను నిపుణులైన సిబ్బంది చూపిస్తూ వాటి విశేషాలను తెలియజేస్తారు. అంతేకాదు, ఈ టూర్‌లో పాల్గొనే విద్యార్థులకు రుచికరమైన స్నాక్స్ , భోజనం కూడా జూపార్క్ వారే ఏర్పాటు చేస్తారు.

మరింత ప్రత్యేకంగా, ప్రతి విద్యార్థికీ జూ టూర్ కిట్ అందజేస్తారు. ఇందులో ఒక అందమైన క్యాప్, నోట్‌బుక్ , ప్రత్యేకమైన బ్యాడ్జ్ ఉంటాయి. ఈ ప్రత్యేకమైన ‘జూ టూర్’ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం రూ. 1,000 మాత్రమే. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వెంటనే 9281007836 నెంబర్‌కు వాట్సప్‌లో సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోండి. వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఒక మరపురాని అనుభూతిని అందించడానికి ఇది చక్కటి అవకాశం..

Read more RELATED
Recommended to you

Latest news