తిరుమలకు వెళ్లే శ్రీ వారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి కొండపై భక్తులు పరుగులు తీశారు. శనివారం ఉదయం క్యూ లైన్ లో ఉన్న భక్తులు… ఒక్కసారిగా పరుగులు తీశారు. క్యూలైన్లపై సరైన సమాచారం ఇవ్వడం లేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. టీటీడీ పాలక మండలి ముందస్తు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తిరుమల కొండ పై శ్రీ వారి భక్తులు పరుగులు తీశారు. అటు తిరుమల శ్రీవారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. వరుసగా మూడు రోజులపాటు హాలిడేస్ రావడంతో…. జనాలు మొత్తం తిరుమలకు తరలి వెళ్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది.
టోకెన్లు లేని వారికి తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం తిరుమల శ్రీవారి క్యూ లైన్ శిలాతోరణం నుంచి కూడా సాగుతోంది. శనివారం రోజున 87,759 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 42,000 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ 4.16 కోట్లుగా నమోదయింది.
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల పరుగులు
శనివారం ఉదయం నుంచి క్యూ లైన్లలో ఉన్న భక్తులు
క్యూ లైన్లపై సరైన సమాచారం ఇవ్వడం లేదని భక్తులు ఆరోపణ#TTD ముందస్తు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ pic.twitter.com/L60HhY3KkD
— Telugu Feed (@Telugufeedsite) August 17, 2025