ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. తన భార్య కారణంగా… పిల్లలను చంపి తండ్రి కూడా ఉరేసుకొని చనిపోయాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని సాయిబాబా కాలనీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు పరిధి నరసరావుపేటలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు యూసుబ్ అనే ముస్లిం వ్యక్తి. ఇతనికి సైదాబీ అనే భార్య ఉంది. అయితే తన భార్య ప్రియుడితో ఫోన్లో తరచూ మాట్లాడుతూ ఉందని… భర్త గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే మొన్న మూడు రోజుల కిందట అంటే 14వ తేదీన భార్య భర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సైదాబీ తన పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఈ నేపథ్యంలోనే పిల్లలు హుస్సేన్ అలాగే ఆరిఫ్ లను తీసుకొని యూసుబ్ తన అక్క ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలకల మందు ఇచ్చి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకొని యూసుబ్ ఆత్మహత్య చేసుకున్నాడు.