విమానాల్లో కొత్త రూల్.. DGCA కీలక నిర్ణయం..!

-

DGCA విమానయాన సంస్థలకి కీలక ఆదేశాలను ఇచ్చింది. విమానాల్లో ఇక మీదట 12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఇవాళ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో కనీసం ఒకరి పక్కన కూర్చునేలా సీటును కేటాయించాలని సంస్థలని కోరింది. ఒకే పిఎన్ఆర్ నెంబర్ పై ప్రయాణిస్తున్న వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన పిల్లలకి సీటు ఇవ్వాలని దీనికి సంబంధించి రికార్డులను నిర్వహించాలని ఆదేశించింది.

ఈ మధ్యకాలంలో పిల్లలకి వాళ్ల తల్లిదండ్రులు పక్కన కాకుండా దూరంగా సీట్లు కేటాయిస్తున్నట్లు DGCA దృష్టికి వచ్చింది. దీంతో ఈ కొత్త ఆదేశాలని జారీ చేసింది అలానే విమానయాన సంస్థలకి కొన్ని వెసులుబాట్లు కూడా అందించింది జీరో బాగేజీ సీటింగ్ ప్రాధాన్యం భోజనాలు సంగీత వాయిద్యాలు తీసుకెళ్లడానికి వంటి వాటికే చార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది అయితే ఇది తప్పనిసరి కాదని ఐచ్చికంగా మాత్రమేనని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news