ముఖ్య‌మైన ఆధార్ SMS కోడ్స్‌.. వివ‌రాలు..!

-

Unique Identification Authority of India (UIDAI) దేశంలోని ఆధార్ కార్డు దారుల‌కు ప‌లు ఎస్ఎంఎస్ స‌ర్వీసుల‌ను అంద‌జేస్తోంది. ఈ స‌ర్వీసులు ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మందికి తెలియ‌దు. ఆధార్ కార్డులు ఉన్న‌వారు ఈ స‌ర్వీసుల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఎస్ఎంఎస్‌ల రూపంలో ప‌లు కోడ్‌ల‌ను పంపితే వినియోగ‌దారులు త‌మ‌కు కావ‌ల్సిన వివ‌రాలను పొంద‌వ‌చ్చు. మ‌రి అందుకు గాను ఆయా కోడ్‌ల‌ను ఎస్ఎంఎస్‌ల రూపంలో ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందామా..

1. వ‌ర్చువ‌ల్ ఐడీని జ‌న‌రేట్ చేయ‌డానికి
GVID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబ‌ర్ చివ‌రి 4 అంకెల‌ను టైప్ చేయాలి. మెసేజ్‌ను 1947కు పంపాలి. వ‌ర్చువ‌ల్ ఐడీ జ‌న‌రేట్ అయి మొబైల్‌కు వ‌స్తుంది.

2. వ‌ర్చువ‌ల్ ఐడీని పొంద‌డానికి
జ‌న‌రేట్ చేయ‌బ‌డిన వ‌ర్చువ‌ల్ ఐడీని తిరిగి పొందాలంటే.. RVID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెల‌ను టైప్ చేయాలి. 1947కు మెసేజ్ పంపాలి.

3. ఓటీపీ కోసం
ఆధార్ ఓటీపీ కావాలనుకుంటే GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెల‌ను టైప్ చేసి మెసేజ్‌ను 1947 నంబ‌ర్‌కు సెండ్ చేయాలి.

4. ఆధార్‌ను లాక్ చేయాలంటే
GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెల‌ను టైప్ చేసి మెసేజ్‌ను 1947కు పంపాలి. అనంత‌రం LOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెల‌ను టైప్ చేసి మ‌ళ్లీ స్పేస్ ఇచ్చి అంత‌కు ముందు వ‌చ్చిన ఓటీపీ 6 అంకెల‌ను టైప్ చేయాలి. అనంతరం మెసేజ్‌ను 1947 కు పంపితే.. ఆధార్ లాక్ అవుతుంది.

5. ఆధార్‌ను అన్‌లాక్ చేయాలంటే
GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వర్చువ‌ల్ ఐడీ చివ‌రి 6 అంకెల‌ను టైప్ చేసి మెసేజ్‌ను 1947కు సెండ్ చేయాలి. ఓటీపీ వ‌స్తుంది. త‌రువాత UNLOCKUID అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వ‌ర్చువ‌ల్ ఐడీ చివ‌రి 6 అంకెల‌ను టైప్ చేసి మ‌ళ్లీ స్పేస్ ఇచ్చి అంత‌కు ముందు వ‌చ్చిన ఓటీపీ 6 అంకెల‌ను టైప్ చేయాలి. మెసేజ్‌ను 1947కు పంపితే.. ఆధార్ అన్‌లాక్ అవుతుంది.

6. బ‌యోమెట్రిక్‌ను లాక్ చేయాలంటే
GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెలు టైప్ చేసి మెసేజ్‌ను 1947కు పంపాలి. ఓటీపీ వ‌స్తుంది. త‌రువాత ENABLEBIOLOCK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెలు టైప్ చేసి మ‌ళ్లీ స్పేస్ ఇచ్చి అంత‌కు ముందు వ‌చ్చిన ఓటీపీ 6 అంకెల‌ను టైప్ చేయాలి. మెసేజ్‌ను 1947కు పంపితే.. ఆధార్ బ‌యోమెట్రిక్ లాక్ అవుతుంది.

7. బ‌యోమెట్రిక్ లాక్‌ను తీసేయాలంటే
GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెలు టైప్ చేసి మెసేజ్‌ను 1947కు పంపితే ఓటీపీ వ‌స్తుంది. త‌రువాత DISABLEBIOLOCK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెల‌ను టైప్ చేసి మ‌ళ్లీ స్పేస్ ఇచ్చి అంత‌కు ముందు వ‌చ్చిన ఓటీపీ 6 అంకెల‌ను టైప్ చేయాలి. మెసేజ్‌ను 1947కు పంపితే ఆధార్ బ‌యోమెట్రిక్ అన్‌లాక్ అవుతుంది.

8. ఆధార్ బ‌యోమెట్రిక్‌ను కొద్దిసేపు మాత్ర‌మే అన్‌లాక్ చేయాల‌నుకుంటే
GETOTP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెల‌ను టైప్ చేసి మెసేజ్‌ను 1947కు పంపితే ఓటీపీ వ‌స్తుంది. త‌రువాత UNLOCKBIO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ చివ‌రి 4 అంకెల‌ను టైప్ చేసి మ‌ళ్లీ స్పేస్ ఇచ్చి అంత‌కు ముందు వ‌చ్చిన ఓటీపీ 6 అంకెల‌ను టైప్ చేసి మెసేజ్‌ను 1947కు పంపాలి. దీంతో ఆధార్ బ‌యోమెట్రిక్ కొంత సేపు మాత్ర‌మే అన్‌లాక్ అవుతుంది. త‌రువాత ఆటోమేటిగ్గా లాక‌వుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version