తెలంగాణలో నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు ఆపుతున్నారని..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ పోలీస్ ఆఫీసర్లతో డీజీపీ జితేందర్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది.
‘నేను త్వరలో రిటైర్ అవుతా నాకేం ఇబ్బంది లేదు.. ఎవరి మాటలో విని మీరు బీఆర్ఎస్ సభకు ఆటంకాలు సృష్టిస్తే మీకే నష్టం..గ్రౌండ్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయి.. జాగ్రత్తగా వ్యవహరించండి.. వాళ్ళు వచ్చాక ఎవరినీ వదలరు. మనం న్యాయంగా ఉంటే వాళ్ళు మనల్ని ఇబ్బందిపెట్టరు’ అని ఆయన సూచనలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, బీఆర్ఎస్ వాహనాలకు పోలీసులు అడుగడుగునా అడ్డుంకులు సృష్టిస్తున్నట్లు సమాచారం.