హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఇవాళ సాయంత్రం జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివెల్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో ఘట్ కేసర్ ORR వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అటు వివిధ జిల్లాల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎల్కతుర్తికి బయలుదేరారు.
500 మంది వేదిక పై కూర్చునేలా బాహుబలీ స్టేజీ సిద్ధం చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. 1213 ఎకరాల్లో సభ కోసం భారీ ఏర్పాట్లు చేసారు. 1100 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ బయలుదేరారు. అమరవీరుల స్థూపం, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ.జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి రజతోత్సవ సభకు హైదరాబాద్ ఎమ్మెల్యేలతో కలిసి ఎల్కతుర్తికి బయలుదేరారు. తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రొ.జయశంకర్ ఉద్యమానికి స్పూర్తి అని తెలిపారు. ఇలాంటి పెద్దలు అందించిన స్పూర్తి గురించి చెప్పక తప్పదన్నారు కేటీఆర్.