#ధనుష్ 50 మూవీ అనౌన్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళంలో తెరకెక్కించే ప్రతి సినిమాని కూడా తెలుగులో విడుదల చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నాడు. వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్న ధనుష్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో రెండు సినిమాలు తెలుగు దర్శకులతో చేస్తూ ఉండడం గమనార్హం. గతంలో తొలిప్రేమ, మిస్టర్ మజ్ను వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ తాజాగా నటిస్తున్న చిత్రం సార్.. ఈ సినిమాను ఏకకాలంలో బైలింగ్వల్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.

మరో తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములా దర్శకత్వంలో కూడా ఇంకో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కెప్టెన్ మిల్లర్ అనే టైటిల్ ను పెట్టినట్లు ప్రకటించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకానుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు తన మైల్ స్టోన్ మూవీని ప్రకటించాడు. ధనుష్ కెరియర్ లో 50వ చిత్రాన్ని తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల కాలంలో వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్న సన్ పిక్చర్స్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది.

ఈ పోస్టర్లో నల్లటి మేఘాల మధ్య.. ఒకచోటి నుంచి దట్టమైన పొగలు రావడం కనిపిస్తుంది. ఈ పోస్టర్తో పాటు డైరెక్టర్ ఎవరు అంటూ గెస్ చేయమని ట్వీట్ కూడా చేశారు నిర్మాతలు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే సినిమాను ఆయన తన స్వీయ దర్శకత్వంలో తీసుకొస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాలి అంటే చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version