ధనుష్ “నేనే వస్తున్నా” మూవీ విడుదల తేదీ ఖరారు

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ధనుష్. తాజాగా మరో తమిళ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నేనే వస్తున్నా’.

నానే వరువెన్ టైటిల్తో తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్స్ విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.

హీరోగా, విలన్ గా రెండు పాత్రలను ధనుష్ ఈ సినిమాలో పోషించడం విశేషం. సెల్వ రాఘవన్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను నిర్మించాడు. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆ మరసటిరోజేే మణిరత్నం పోన్నియన్ సెల్వన్” రిలీజ్ కానుంది. మరి ఆ సినిమా పోటీని తట్టుకొని ధనుష్ నిలుస్తాడా? లేదా అన్నది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news