ఎవడో సుబ్బారెడ్డిట కడప నుండి వచ్చి భూములు దొబ్బేస్తున్నాడు అంటూ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేరు వచ్చే విధంగా మంత్ర ధర్మాన ప్రసాద్ రావు సంచలన కామెంట్స్ చేసారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి వైకాపా ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి చేసినవా లేక కడప సుబ్బారెడ్డి వేరా అనే చర్చ నడుస్తోంది. ఎవరైనా ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో సొంత పార్టీ నేతల మీద మంత్రి ఇలా కామెంట్స్ చేయడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఈయన కామెంట్స్ చేయడం వైఎస్ఆర్సిపి నేతల్లో కలవరం రేపుతోంది. కడప నుండి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూములు దొబ్బేస్తున్నాడు. నువ్వు ఎవడివి శ్రీకాకుళం నీ అబ్బ సొమ్ము కాదు వచ్చిన వాడు ఏ పార్టీ అనేది చూడను అక్కడి నుండి వచ్చి ఇక్కడ అజమాయిషీ చేస్తాం అనుకుంటారు అలాంటివి అవమానంగా భావిస్తా శ్రీకాకుళంలో వనరులు ఉన్నాయని పక్క జిల్లాల నుండి వచ్చేస్తున్నారు అని అన్నారు.