హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలపై… బిజెపి పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు… కెసిఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు. హుజరాబాద్ నియోజకవర్గం ఫలితం బిజెపి పార్టీ కార్యకర్త లేదని పేర్కొన్నారు ధర్మపురి అరవింద్.
ఇక త్వరలోనే బిజెపి పార్టీకి మంచి రోజులు రానున్నాయని… పేర్కొన్న ధర్మపురి అరవింద్.. నాయకులకు టికెట్లు ఇవ్వలేక… నెత్తి పగులగొట్టుకుని పరిస్థితి బిజెపి నాయకులకు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే భారతీయ జనతా పార్టీ నిజమైన ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. ప్రజలను, ఓట్లను కొనుక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిదని, హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టినా… ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. అవినీతి, అహంకారం టీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు దారి తీస్తున్నదని హెచ్చరించారు.
కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం దిశగా సాగుతున్నారు. 17 రౌండ్ ముగిసే సరికి దాదాపు 13 వేల మెజారిటీ ని సంపాదించారు ఈటల రాజేందర్. మరికాసేపట్లో నే ఈటెల రాజేందర్ విజయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.