హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు కావడంపై.. ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. హుజరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత తనదేనని… ఈ ఓటమిపై కార్యకర్తలు ఎవరు ఆందోళన, నిరాశ చెందనక్కర్లేదని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. మరో 20 ఏళ్లపాటు పోరాటం చేసే వయసు తనకు ఉందని… ఎవరు బాధపడాల్సిన అవసరం లేదన్నారు.
ఒక ఉప ఎన్నికల్లో పార్టీని నిర్దేశించే లేవని… ఆలస్యంగా అభ్యర్థిని నిలబెట్టినా ఊరు..ఊరూ తిరిగాడు అని… బలమురి వెంకట్ బలమైన నాయకుడు అవుతారన్నారు. ఎన్నికల ఫలితాలకు పూర్తి బాధ్యత వహిస్తానని… రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు.
కష్టపడి పనిచేసే ఓపిక.. సహనం తనకు ఉందని… క్యాడర్ ఆత్మస్థైర్యంతో ఉండాలని పేర్కొన్నారు. ఈ ఓటమితో తనలో మరింత కసి పెంచుతుందని… గులాబీ చీర వదిలి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువ అని… స్వేచ్ఛతో ఎక్కువ మాట్లాడవచ్చని తెలిపారు. రేపటి నుంచి జనాల్లోకి వెళ్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి.