Dharmashala :మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయిన టీమిండియా…. ఆధిక్యం ఎంతంటే..?

-

ధర్మశాల వేదికగా భారత్ ,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టులో టీమ్ ఇండియా పట్టు బిగిస్తోంది.ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో టీమ్ ఇండియా 477 రన్స్ కి   ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 259 రన్స్  ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (103), గిల్(110) సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది.

మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే 123.4 ఓవర్ వద్ద అండర్సన్ వేసిన బంతికి కుల్దీప్ యాదవ్ (30) ఔటయ్యాడు.క్రీజ్లోకి వచ్చిన సిరాజ్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు.ఇక ఈ మ్యాచ్ లో అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఫస్ట్ ప్లేస్ లో మురళీధరన్ (800), సెకండ్ ప్లేస్ లో షేన్ వార్న్ (708) ఉన్నారు.ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తా చాటారు. చివరి రెండు రోజులు ధర్మశాల పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్కు అనుకూలంగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version