ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ.. వీడియో వైరల్

-

అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్‌ను సందర్శించారు. అక్కడ ఏనుగు ఎక్కి సఫారీ చేశారు. 1957 తర్వాత ఈ పార్క్‌ను సందర్శించిన తొలి ప్రధాని మోదీ కావడం విశేషం. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం మోదీ అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఛాపర్‌లో గోలాఘాట్‌ జిల్లాలోని కజిరంగకు వెళ్లి.. రాత్రి జాతీయ పార్క్‌లోనే సేదతీరారు.

ఈ తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్‌ కొహోరా రేంజ్‌ను సందర్శించి తొలుత ఏనుగు ఎక్కి విహరించారు. ఆ తర్వాత జీపులో సఫారీ చేస్తూ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువులను వీక్షించారు. మోదీ వెంట పార్క్‌ డైరెక్టర్‌ సొనాలీ ఘోష్‌, అటవీశాఖ సీనియర్‌ అధికారులు ఉన్నారు. సఫారీ అనంతరం మోదీ ఏనుగులకు చెరకు గడలను తినిపించారు. ఈ చిత్రాలను మోదీ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్‌ పార్క్‌ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version