లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన వ్యక్తిని.. ఓ కేసు నుండి తప్పించేందుకు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ రూ.70 వేలు లంచం డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలోనే సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సై వేణుగోపాల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో ఆయన తాండూర్ పట్టణ ఎస్సైగా విధులు నిర్వహించారు. అయితే, దీనిపై విచారణ అనంతరం ఏసీబీ అధికారుల ఆధారాలతో సహా బయటపెట్డడంతో ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.