చిన్న అక్షరం తేడాతో రూ.5.47 కోట్లు పోగొట్టుకున్న మేఘా కంపెనీ

-

సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల కింద బడా ఇంజినీరింగ్ కంపెనీ అయిన మేఘాను సైతం సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. మెయిల్ ఐడీలో చిన్న అక్షరం తప్పును కంపెనీ గుర్తించకపోవడంతో రూ.5.47కోట్లును పోగొట్టుకోవాల్సి వచ్చింది.

సైబర్ క్రైమ్, ఫిర్యాదు దారుల కథనం ప్రకారం.. నగరంలోని బాలానగర్‌లో ఉన్న మెఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ నెదర్‌ల్యాండ్స్‌కు చెందిన డ్యూకర్ కంబషన్ ఇంజినీర్స్, టఫ్స్ షిప్పర్ కంపెనీతో బర్నర్ ప్యాకేజీ, ఇన్‌సినిరేటర్ బర్నర్‌ల సరఫరాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నుంచి ఈ అగ్రిమెంట్ నడుస్తున్నది. ఈ ఆర్ధిక లావాదేవీలను మెఘా కంపెనీ.. నెదర్‌ల్యాండ్స్ కంపెనీకి చెందిన ఏబీఎన్ ఆమ్రో అకౌంట్‌తో జరిపారు.

ప్రతీ లావాదేవీకి నెదర్‌ల్యాండ్స్ కంపెనీ తమ అధికారిక మెయిల్ ఐడీ [email protected] ద్వారా ఆ కంపెనీ ప్రతినిధి పీటర్ న్యూజిస్ ధృవీకరించేవారు. ఇక గతేడాది నవంబర్‌లో మేఘా కంపెనికి [email protected] ద్వారా పీటర్ న్యూజిస్ పంపినట్టు ఓ మెయిల్ వచ్చింది. అది ఫేక్ అని మేఘా వాళ్లు నిర్దారించుకోలేదు. గతనెల 24, 25 తేదీల్లో ఆ మెయిల్ నుంచి వచ్చిన ఖాతాకు రూ.5.47 కోట్లను మేఘా కంపెనీ పంపింది. అయితే, పేమెంట్ నిర్ధారణకు సంబంధించి ఎటువంటి ధృవీకరణ రాకపోవడంతో మేఘా కంపెనీ నెదర్‌ల్యాండ్స్ కంపెనీని సంప్రదించగా.. అసలు విషయం తెలిసింది. ఒరిజినల్ మెయిల్ ఐడీలోని చిన్న లెటర్ మిస్టేక్ వలన భారీ మొత్తంలో డబ్బులు సైబర్ నేరగాళ్లు చేతికి చిక్కాయని తెలుసుకున్నారు. అనంతరం అకౌంట్స్ మేనేజర్ డీ.శ్రీహరీశ్ ఈ నెల 13న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు.వారు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news