ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా పనిచేసిన మహానేత దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ రోజు ఆ మహానేత వర్థంతి సందర్భంగా రాష్ట్రము అంతటా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనమైన వీడ్కోలు పలికింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్రము అంతటా పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తాజాగా దిగ్విజయ్ సింగ్ “రైతే రాజైతే” అన్న పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ వైఎస్ తో నాకు విడదీయరాని అనుబంధం ఉంది అన్నారు. అస్సలు వైఎస్ లేకుంటే యూపీఏ ప్రభుత్వం ఏర్పడేది కాదంటూ ఆయనను పొగిడారు. వైఎస్ ఆనాడు మరణించకుండా ఉంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉండేదని కాదన్నారు.
ఒక నాయకుడిగా ఎలా ఉండాలన్నది వైఎస్ నుండి నేను చాల నేర్చుకున్నానని చెప్పడంలో ఆయన ఎంతటి మహనీయుడు అర్థమయి ఉంటుంది.