ట్రెండింగ్‌లో ధోని న్యూలుక్‌: ఫిదా అవుతున్న అభిమానులు …

-

మహేంద్ర సింగ్ ధోని… ఈ పేరు తెలియని వారు మన దేశంలో ఉండరేమో. ఎందుకంటే భారత క్రికెట్ జట్టు కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు మహేంద్రసింగ్ ధోని. కెప్టెన్ గా ధోని బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి…టీమిండియాను తిరుగులేని జట్టుగా తయారు చేశాడు. ధోని సారథ్యంలోనే.. టీమిండియాకు రెండు వరల్డ్ కప్ లు వచ్చాయి.

అలాగే ధోని కి ఉన్న… క్రేజ్ ఇండియాలో మరే క్రికెటర్ కు ఉండదు. రిటైర్ అయినప్పటికీ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ ఓ కొత్త హెయిర్ స్టైల్ తో అందరినీ కనువిందు చేశాడు. ఎన్నడూ లేని విధంగా మహేంద్ర సింగ్ ధోనీ తన హెయిర్ స్టైల్ ను డిజైన్ చేయించాడు. అలాగే… కాస్త గడ్డం పెంచి నయా లుక్ లో దర్శనమిచ్చాడు. ఇప్పుడు ధోని కి సంబంధించిన ఈ కొత్త హెయిర్ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అటు ధోని హెయిర్ స్టైల్ చాలా అద్భుతంగా ఉందని… ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news