వర్షాకాలంలో మీ మనసును ఉల్లాసపరిచే టీ.. వెరైటీలు మీకోసమే.

-

చిటపట చినుకులు కురుస్తున్నప్పుడు ఒక చేతిలో చాయ్ కప్పు, మరో చేతిలో పుస్తకం పట్టుకుని కిటీకీలో నుండి వర్షపు నీటి వంక చూస్తుంటే వచ్చే మజానే వేరు. జీవితాన్ని ఆస్వాదించాలన్న ఆలోచన ఉన్నవారే ఈ ఆనందాన్ని అనుభవించగలరు. అలాంటి ఆనందాన్ని అందించే టీ వెరైటీలు చాలా ఉన్నాయి. అవి మీ మనసును ఉల్లాసపరుస్తాయి. ఉత్తేజపరుస్తాయి. ప్రస్తుతం టీలోని ఆ వెరైటీల గురించి తెలుసుకుందాం.

అల్లం టీ

రోగనిరోధక శక్తిని పెంచే అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కసారి గొంతులోకి దిగినాక ఏదో కొత్త ఉత్తేజం వస్తుంది. రక్తప్రసరణ పనితీరును మెరుగుపర్చడంతో పాటు ఊపిరితిత్తుల మీద ప్రభావాన్ని చూపి ప్రశాంతతను కలగజేస్తుంది.

తులసి టీ

ఆయుర్వేదంలో తులసికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గుండే ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తులసి టీ చాలా పనిచేస్తుంది. ఇందులో పుదీనాని కలుపుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతని బాగా తగ్గించవచ్చు. అంతేకాదు వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే ఫ్లూ వంటి సమస్యలను దూరంచేస్తుంది.

గ్రీన్ టీ

ఫిట్ నెస్ గురించి ఆలోచించే వారు గ్రీన్ టీ పట్ల శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు. ఇందులో ఉండే పోషకాలు ఈ వర్షాకాలంలోని గంభీరత్వాన్ని దూరం చేసి మిమ్మల్ని హాయిగా ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

మసాలా టీ

దాదాపుగా ప్రతీ ఒక్కరికీ నచ్చే చాయ్ ఏదైనా ఉందంటే అది మసాలా చాయ్ అనే చెప్పుకోవాలి. అద్భుతమైన రుచి, అదిరిపోయే వాసనతో నోటికి తగలగానే అమాంతం నరాలు జివ్వుమనిపించేలా చేసే మసాలా చాయ్ ని వర్షాకాలంలో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news