డయబెటిక్‌ పేషంట్లు..ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను సైడ్‌ చేయాల్సిందే..!

-

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను బరువు తగ్గడానికి ఎక్కువగా వాడతారు..వంటల్లో కూడా.. రుచికోసం దీన్ని చాలామంది ఉపయోగిస్తారు.. ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.. పరిమితికి మించి వాడటం వల్ల.. ఇది ఆరోగ్యాన్ని ఘోరంగా దెబ్బతీస్తుంది. బరువు తగ్గాలి కదా అని విపరీతంగా వాడేస్తే అంతే సంగతులు.. ఆపిల్ సైడర్ వెనిగర్ ఎంత మోతాదులో వాడాలి, అతిగా వాడితే డయాబెటిస్ ఇతర వ్యాధులు చుట్టుముడతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ డయాబెటిస్‌లో అత్యంత ప్రమాదకరం కానుంది. ఫలితంగా డయాబెటిస్ నియంత్రించడం కష్టమౌతుంది. డయాబెటిస్ నుంచి కాపాడుకోవాలంటే..ఆపిల్ సైడర్ వెనిగర్ నుంచి దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వల్ల ఇంకా ఎలాంటి నష్టాలు ఉంటాయో ఒకసారి చూద్దాం..!

ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ఎసిడిక్ యాసిడ్ పంటి వ్యాధులకు కారణమవుతుందట… పంటిపై ఉండే ఎనామిల్‌ను దెబ్బ తీస్తుంది. నిజానికి ఈ ఎనామిల్‌ జీవతకాలం 150 ఏళ్లు.. కానీ ఈరోజుల్లో ఎవరికి అంత హెల్తీగా పళ్లు ఉండటం లేదు. తినే తిండి వల్లే ఇది దెబ్బతింటుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వల్ల.. పళ్లు బలహీనమౌతాయి. పంటి చిగుళ్లు దెబ్బతింటాయి. పంటి నొప్పులతో బాధపడేవారికి ఇది ఏ మాత్రం మంచిది కాదు..
ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది ఓ రకమైన యాసిడ్. ఇది తినడం వల్ల యాసిడ్ సమస్యలు వస్తాయి.. జీర్ణ సంబంధ సమస్యలుండే అవకాశమున్నందున వీటికి దూరంగా ఉండాలి. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల వికారంగా ఉంటుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల ఎముకలకు కూడా హాని కలుగుతుంది. అదే పనిగా ఆపిల్ సైడర్ వెనిగర్ వినియోగిస్తే ఎముకలకు బలహీనపడతాయి. కాల్షియం లోపం, బలహీనమైన ఎముకల సమస్యలతో బాధపడేవాళ్లు ఆపిల్ సైడర్ వెనిగర్ వినియోగించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇది చర్మానికి కూడా ప్రమాదకరం కావచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల.. చర్మంలో మంట, దురద, ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది..చర్మ సంబంధిత ఎలర్జీల నుంచి దూరంగా ఉండాలంటే ఆపిల్ సైడర్ వినియోగించకపోవడమే ఉత్తమం..
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ తీసుకుంటే.. కడుపు నిండిన ఫీలింగ్‌ వస్తుంది. దీని వల్ల ఆహారం తక్కువగా తీసుకోవడంలో సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గడంలో ఇది ఉపయోగపడుతుంది అంటారు.. కానీ, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఎక్కువగా తీసుకుంటే, గ్యాస్ట్రోపెరేసిస్‌కు కూడా దారి తీస్తుంది. ఈ పరిస్థితిలో పొత్తికడుపు సిరలు సరిగ్గా పనిచేయవు. NCBI నివేదిక ప్రకారం…ఈ పరిస్థితి సాధారణంగా టైప్‌ 1 డయాబెటిస్‌‌ పేషంట్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్ తీసుకుంటే దాని లక్షణాలను మరింత దిగజారవచ్చు. గ్యాస్ట్రోపరేసిస్ కారణంగా గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version