డైలాగ్ ఆఫ్ ద డే : యే హిజాబ్ క్యారే..?

-

క‌ర్ణాట‌క వాకిట పుట్టిన హిబాజ్ వివాదం అటు పార్ల‌మెంట్ ను ఇటు ఆ రాష్ట్ర హైకోర్టునూ క‌దిపి కుదిపేసింది. సున్నితం అయిన విష‌యం కావ‌డంతో రాజ‌కీయ పార్టీలు కూడా ఇదే అదునుగా మాట్లాడేందుకు, రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసేందుకు, త‌ద్వారా రాజ్యంలో రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ వివాదంలో క‌శ్మీరీ పార్టీలు (ముస్లీం వాద పార్టీలు, అతి వాద పార్టీలు) స్పందించాయి. దీంతో వివాదం పై ఇప్ప‌టికే రేగుతున్న అల‌జ‌డులు ఎందాక న‌డుస్తాయో అన్న‌ది
క‌ర్ణాట‌క రాష్ట్ర ఉన్న‌త న్యాయ స్థానం ఆందోళ‌న మ‌రియు విచారం కూడా!

మ‌త ప్రాతిప‌దిక రాజ‌కీయాలు న‌డిపేందుకు ఇష్ట‌ప‌డే పార్టీలు వాటి అనుస‌ర‌ణ‌లు ఉన్నంత కాలం దేశంలో కొత్త కొత్త వివాదాలకు లోటే ఉండదు. న్యాయ స్థానాలు సైతం ఇది ఒక సున్నిత అంశం అని కాస్త సంయ‌మ‌నం పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. ద‌య‌చేసి విద్యార్థులూ! ఆలోచించండి మీకెందుకు ఈ రాజ‌కీయాలు. మీకెందుకు మ‌త వాదాలు.. మీరు జాగ్ర‌త్త‌గా చ‌దువుకోండి.
మిమ్మ‌ల్ని చ‌దువుల‌కు పంపే వేళ త‌ల్లిదండ్రులు ప‌డుతున్న క‌ష్టాన్ని మాత్ర‌మే గుర్తించండి…

క‌ర్ణాట‌క వాకిట కొత్త రాజ‌కీయం న‌డుస్తోంది. రాష్ట్రంలోని ఉడిపితో సహా ప‌లు ప్రాంతాల‌లో ముస్లిం విద్యార్థినుల వ‌స్త్ర ధార‌ణ‌కు సంబంధించి రేగుతున్న వివాదంలో అటు విద్యాసంస్థ‌లు, ఇటు కొన్ని మ‌త ప్రాతిప‌దిక సంస్థ‌లు ఈ రెండింటి మ‌ధ్య వాగ్వాదం న‌డుస్తోంది. ఓ పాఠ‌శాల ప్రాంగ‌ణంలో జాతీయ జెండా స్థానే విద్యార్థులు కాషాయ జెండా ఎగుర వేసిన దృశ్యాలు కూడా వ‌చ్చాయి. ఇప్పుడీ వివాదం ఎటునుంచి ఎటు పోతుందో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు.

ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై అప్ర‌మ‌త్త‌మై మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.అంతా సంయ‌మ‌నం పాటించాలి అని,విష‌యం కోర్టులో ఉంద‌ని చెబుతూ శాంతి సందేశం ఒక‌టి పంపారు. కానీ నిన్న‌టి వేళ రేగిన ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో అటు ముస్లీం సంఘాల కూడా మండిప‌డుతున్నాయి. విద్యార్థినులు హిజాబ్ ధ‌రించ‌డం అన్న‌ది మ‌త సంప్ర‌దాయం అని, దీనిపై గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడెందుకు అభ్యంత‌రాలు చెబుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ త‌రుణాన ఏ క్ష‌ణాన ఏ వివాదం రానుందో అని పోలీసులు సైతం అప్ర‌మ‌త్తం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version