డైలాగ్ ఆఫ్ ద డే : అరే లోకేశ్ మారాడ్రా ! తియ్యండ్రా బండ్లు !

-

ఓడలు ఏమ‌వుతాయి
బండ్ల‌వుతాయి
బండ్ల‌న్నీ ఏమ‌యిపోతాయి
ఓడ‌ల‌వుతాయి అంటే
వారు వీరు వీరు వారు
రాజ‌కీయాల్లో అవుతూ ఉంటారు
ఆ విధంగా ఇమ్మెచ్యూర్డ్ థాట్స్ కూడా పోయి
నాయ‌కుల‌కు మంంచి పేరు వ‌చ్చే రోజు ఒక‌టి వ‌స్తుంది

అదే లోకేశ్ కు వ‌చ్చింది..చిన‌బాబు రాజకీయాల్లో ప‌రిణితి తెచ్చుకుంటున్నారు. జంగారెడ్డి గూడెం ఘ‌ట‌న‌లో చాలా స‌మ‌య స్ఫూర్తి చాటారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు కౌంట‌ర్ ఇచ్చారు. అది మామూలు కౌంట‌ర్ కాదు అదిరిపోయే కౌంట‌ర్. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా,జంగారెడ్డి గూడెంలో జ‌రిగినవి స‌హ‌జ మ‌ర‌ణాలేన‌ని అవి సారా మర‌ణాలు కావ‌ని తేల్చేశారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. క‌ల్తీ సారా కార‌ణంగా వారు చ‌నిపోవ‌డం అన్న‌ది అబద్ధ‌మ‌ని ఇదంతా విప‌క్షాల కుట్ర అని అన్నారు. కానీ ఇదంతా అవాస్త‌వ‌మ‌ని అవి సహ‌జ మ‌ర‌ణాలే అయితే ఎఫ్ఐఆర్ ఎందుకు న‌మోదు చేస్తార‌ని అంటూ జ‌గ‌న్ కు వెర్బ‌ల్ కౌంటర్ ఇచ్చారు. మీరంతా చెబుతున్న విధంగా యాభై వేల మందికి పైగా ఉన్న ఊళ్లో సారా త‌యారీ జ‌ర‌గ‌ద‌ని ఎలా అంటార‌ని ప్ర‌శ్నించారు. ఇందుకు త‌గ్గ సాక్షాధారాలు తాము చూపిన‌ప్ప‌టికీ వైసీపీ నిజాలు ఒప్పుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

కానీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం వీటిని ఒప్పుకోవ‌డం లేదు.అవి స‌హ‌జ మ‌ర‌ణాలేన‌ని ప‌దే ప‌దే అంటూ ఉన్నారు. దీనిపై మంత్రులు కూడా విప‌క్షాల‌ను తిట్టిపోయ‌డ‌మే ల‌క్ష్యంగా ఉన్నారే త‌ప్ప నిజానిజాల వెల్ల‌డికి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. మ‌ద్య పాన నిషేధం తీసుకువ‌స్తామ‌ని ఆరోజు చెప్పిన జ‌గ‌న్ ఎందుక‌నో ఆ మాట మ‌రిచి రాష్ట్ర వ్యాప్తంగా క‌ల్తీ సారా అమ్మ‌కాల‌ను నియంత్రించ‌లేక అవ‌స్థ ప‌డుతున్నార‌ని లోకేశ్ తో స‌హా మిగ‌తా వారంతా గ‌గ్గోలు పెడుతున్నారు.

దీంతో ఈ పరిణామాన్ని రాజకీయంగా మ‌లిచేందుకు అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ పోటీ ప‌డుతున్నాయి. ఎవ‌రికి వారు త‌మ‌దే పై చేయి అన్న పంతంలో భాగంగా ఇష్యూని ఫోక‌స్ చేస్తున్నారు. అయితే వైసీపీ స‌ర్కారు మాత్రం నిజాలు ఒప్పుకోవ‌డం లేదు. వాస్త‌వాల‌ను అంగీక‌రించ‌డం లేదు. ఈ ద‌శ‌లో సీన్ లోకి వ‌చ్చిన లోకేశ్ త‌న‌దైన పోరాటం సాగిస్తాన‌నే అంటున్నారు. గ‌తంలో ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన వెంట‌నే న్యాయ విచార‌ణ‌కు ఆదేశించేవారు అని కానీ ఇప్పుడు స‌ర్కారు దాని ఊసే ఎత్త‌డం లేదు అని టీడీపీ అంటోంది.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ చాలా కాలం నుంచి మంచి ట‌ర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్న లోకేశ్ కు మాట్లాడేందుకు ఓ ఇష్యూ దొరికింది.దీనిపై ప్ర‌జా పోరాటం సాగిస్తే ఫ‌లితాలు వ‌స్తాయి.అదేవిధంగా జ‌నంకు కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంది. పార్టీకి కూడా ఇమేజ్ పెరుగుతుంది.ఆ విధంగా డైలాగులు చెప్ప‌డంతో పాటు ప‌బ్లిక్ డొమైన్ లో ఇంకొంత క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే లోకేశ్ కు మంచి రాజ‌కీయ జీవితం ద‌క్క‌డం ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version