ట్విట‌ర్ పోల్ : మ‌ళ్లీ అత‌డే సీఎం అవుతారా ? ఓవ‌ర్ టు జ‌గ‌న్

-

అవును 36.2%
కాదు 63.8%
వైసీపీ శ్రేణులకు అతి విశ్వాసం ఉంది
మంత్రుల‌కూ అదే విశ్వాసం ఉంది
అంటే వ‌చ్చే సారి కూడా త‌మ నేతే సీఎం అని
కానీ విభిన్నంగా ఫ‌లితాలు వ‌స్తే ఏమ‌యిపోతారో
సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ కు ప్ర‌త్యామ్నాయ శ‌క్తి
రావాలి అన్న‌ది ఓ నినాదంగా మారుతోంది రోజురోజుకూ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడు విభిన్నంగా ఉంటాయి.పక్కన ఉన్న తెలంగాణ కంటే ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్టీల కంటే రెండు ప్రాంతీయ పార్టీలు అయిన టీడీపీ లకే మరియు వైసీపీ లకే ఎక్కువ.ఇందులో భాగంగానే రాష్ట్రం విడిపోయిన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.అయితే అనూహ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఘోర పరాభవం తప్పలేదు.

Jagan

వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి… ప్రజల్లో తిరగడం, పాదయాత్ర చేయడం,అనేక హామీలు ఇవ్వడం కారణంగా ఏపీలో మొట్ట మొదటిసారిగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.150 సీట్లకు పైగా మెజారిటీని పొంది… అఖండ విజయం అందుకుంది వైసిపి పార్టీ. అయితే… వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే అమరావతి లో వేలు పెట్టింది. ఏపీకి మూడు రాజధానులు ఉండాలని… కొత్త చర్చకు తెరలేపారు సీఎం జగన్. దీనికి అనుగుణంగానే అన్ని చర్యలను చేపట్టారు.

అమరావతి రైతులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎంత మొత్తుకున్నా… ఎక్కడ తగ్గేది లేదంటూ… ఏపీకి మూడు రాజధానులు ముద్దు అంటూ ముందుకు వెళ్లారు.అయితే అటు సంక్షేమ పైన కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీల లో భాగంగా నవరత్నాలను…. చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీని ఫలితంగానే ఏపీ లో 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ పార్టీ విజయకేతనం అందుకుంది.

అయితే… ఏడాది చివర్లో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే వార్తలు గత 15 రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి. ఆయన ముందుస్తు ఎన్నికలకు వెళతారో లేదో తెలియదు కానీ… ఎమ్మెల్యేలను మాత్రం అప్రమత్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలని పేర్కొన్నారు. అయితే తాజాగా మ‌న లోకం నిర్వహించిన ట్విట‌ర్ పోల్‌ లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. ఏపీలో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతారా ? అనే ప్రశ్నకు… నెటిజన్లు నెగిటివ్ గా ఓట్లు వేశారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అవుతారని 36.2 శాతం మంది ఓట్లు వేయగా, సీఎం కాబోదని 63.8 శాతం మంది ఓట్లు వేశారు. అయితే నిజంగా సీఎం జగన్ మరోసారి ఓడిపోతారు అనేది తేలాలంటే ఎన్నికలు వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version