గ్రామంలో వజ్రాలు… ఎగబడుతున్న జనాలు

-

వజ్రం… ఒక్కటి మన చేతిలో ఉండే మన లైఫ్ మారినట్టే. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాల కోసం పోరాటాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే నాగాలాండ్‌ బొగ్గు గనుల్లో వజ్రాలు బయటపడ్డాయి. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మోన్‌ జిల్లా కేంద్రానికి శివారు గ్రామం వాంచింగ్‌ లో ఉన్న బొగ్గు గనిలో తవ్వకాలు జరిపే క్రమంలో ఈ నెల 25 న వజ్రాలు బయటపడ్డాయి.

అవి మెరుస్తూ ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీనితో ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే అవి నిజమా కాదా… అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే దీనికి సంబంధించి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఇక్క్లాడ గతంలో కూడా పరిశోధనలు జరిపారు. వాంచింగ్ గనులలో లభించే బొగ్గు చాలా నాణ్యమైనది అని అధికారులు అంటున్నారు.

ముందు ఒక గ్రామస్థుడుకి వజ్రం దొరికింది అని ప్రచారం జరగడం, గ్రామ ప్రజలు వేటగాళ్ళు అందరూ కూడా అక్కడ వాలిపోయి వాటి కోసం కోసం ఎగబడ్డారు. ఇవి వజ్రాలేనా లేకపోతే క్వార్టజ్ శిలలా అని అనుమానాలు ఉన్నాయి. నాలుగు నుంచి అయిదు రాళ్ళు అక్కడ దొరికాయి. ఆ తర్వాత వజ్రాల మోన్ జిల్లా కలెక్టర్ థవాశీలన్ మీడియాకు వెల్లడించారు. అవి వజ్రాలే అయి ఉండవచ్చు అని పేర్కొంటున్నారు. అయితే అవి వజ్రాలు కాకపోవచ్చు అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సుత్తితో కొడితే పగిలిపోయాయని సదరు గ్రామ సర్పంచ్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version