పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఊసరవెల్లిలా మారేడు అంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ అంశం మీద తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి అని ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశం లాంగ్ టర్మ్ గా పార్టీకి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది అని పేర్కొన్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపు కృషి చేయడం వెనుక అనేక ప్రజా ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవడికి పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు వివరిస్తున్నాడు అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
మిస్టర్ ప్రకాష్ రాజ్ మీ రాజకీయ పరిజ్ఞానం ఏమిటో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లోనే అర్థమైంది. సుబ్రహ్మణ్యస్వామి ను తొక్కి పట్టి నార తీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ ఉద్దేశం లో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే బిజెపి గాని మరి పార్టీ గాని ప్రజలకు మంచి చేసిన హర్షించ గాలి విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోవాలి నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలం.. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ దేశానికి బిజెపి లాంటి పార్టీతో ఏపీ జనసేన పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహానా మేధావులు ఎన్ని వాగినా బిజెపి జనసేన కూటమి శక్తిని ఆపలేరు. ముందు నువ్వు ఒక మనిషి లా తయారై అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మంచి మనిషి, నిస్వార్థపరుడు అయిన మా నాయకుడిని విమర్శించు. డైరెక్టర్ స్ ని కాకా బట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంత కన్నా మంచిగా మాట్లాడడం ఏం తెలుసు ? బిజెపి నాయకత్వాన్ని నువ్వు నోటికి వచ్చినట్లు విమర్శించినా నిన్ను ఎవరూ ఏమీ లేదు అంటే అది బిజెపి డెమోక్రసీ కి ఇచ్చే విలువ అది అర్థం చేసుకో ఆయన ఆయన అయ్న్నారు. మీడియా అడిగింది కదా నువ్వు పొంగిపోయి నీ పనికి మాలిన రాజకీయ డొల్ల తనాన్ని బయట వేసుకోకు అంటూ ఆయన కామెంట్ చేశారు.