విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో రోజురోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి. విజయవాడలో డయేరియా కేసుల సంఖ్య 380కి చేరింది. దీంతో వైద్యులు మెడికల్ క్యాంప్ కొనసాగిస్తున్నారు.

అటు ఇప్పటికే విజయవాడలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారని అంటున్నారు. విజయవాడలో డయేరియా వణికిస్తోంది. న్యూరాజేశ్వరిపేటలో విపరీతమైన వాంతులు, విరోచనాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు కలుషితం అయిందని అంటున్నారు విజయవాడ స్థానికులు. నీటి శాంపిల్స్ సేకరించడంతో పాటు ఇంటింటి సర్వే చేస్తున్నారు అధికారులు.