అధికారం ఉందని రెచ్చిపోయి రంకెలు వేయరాదు.అధికారం లేని రోజులు వస్తాయి కదా అప్పుడు బాధపడుతూ..పాత తప్పులు వెతుక్కోవడం అస్సలు తగదు..ఈ రెండూ చేయకూడదు. ఈశ్వరుడి నోరు ఇచ్చాడు కదా అని నోరేసుకుని పడిపోకూడదు అని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటారు..ఓ డైలాగ్ రూపంలో.. ఇప్పుడివే మాటలు అధికారంలో ఉన్నవారికి మరియు లేని వారికి కూడా అనువర్తిస్తాయి. వీలున్నంత వరకూ నమ్రతతో ఉండడం..అణిగిమణిగి ఉండడం అన్నవి చాలా మంచినే చేస్తాయి. ఎక్కువ పొలిటికల్ మైలేజీని కూడా పెంచుతాయి. ఆ విధంగా కాకుండా ఉంటే ఎప్పటిటకప్పుడు నాయకులు ఇళ్లకే పరిమితం అవుతూ గత కాల తప్పిదాలను తల్చుకోవడం మినహా చేసేదేం ఉండదు. ఎవ్వరైనా సరే ప్రజలకు మంచి చేయాలన్న తపనతో పనిచేయడమే ఓ అంతిమ అవధి కావాలి. అది లేని రోజున ఎంత కృషి చేసినా సానుకూల ఫలితాలు అయితే రావు గాక రావు.
ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన అధికారంలోకి వచ్చినా హిందువులపై జరిగిన దాడులను నియంత్రించలేకపోయింది అన్న వాదనే విపరీతంగా వినిపిస్తోంది. అదేవిధంగా కేవలం కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల కారణంగా కంగనా రనౌత్ (నటి, బీజేపీ మద్దతుదారురాలు) ఇంటిని ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. అప్పుడు ఇది అధికార పార్టీ అహంకారానికి తార్కాణం అని ఆ రోజు ఆమె మండిపడ్డారు. నిబంధనలు సరిగా లేవన్న కారణంగా కంగనా ఇంటిని కూల్చివేయడమే కాకుండా ఆమె నగరం విడిచి వెళ్లేందుకు కూడా శివసేన చేష్టలే కారణం అయి ఉన్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆ రోజు ఆర్థిక రాజధాని ముంబయి ని పాక్ ఆక్రమిత కశ్మీరుతో పోల్చి, తన ఆగ్రహాన్ని ట్విటర్ లో మాటల రూపంలో పొందుపరిచారు. ‘ఈ రోజు నా ఇల్లు బద్ధలైంది. రేపు నీ అహంకారం బద్దలవుతుంది’ అంటూ కంగనా చేసిన హెచ్చరికలు కూడా ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి. ఆమె శాపం కారణంగానే ఉద్ధవ్ ఇంటి బాట పట్టారని కూడా నెటిజనులు అంటున్నారు.