సముద్రాలు ఎన్నో జీవరాశులకు నిలయం..రకరకాల జీవులు ఉంటాయి.అందులో కొన్ని చూడటానికి అందంగా ఉంటే, మరి కొన్ని మాత్రం భయంకరంగా ఉంటాయి. అలాంటి భయంకర ప్రాని జనాల ముందుకు వస్తే ఇక అంతే.. అటువంటి వింత, భయంకరమైన ఓ జీవి, ఆగ్నేయ ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. ఈ చేపను ప్రపంచంలోనే అత్యంత వికారమైన జీవిగా పేర్కొంటారు. ఈ జీవి చాలా భయంకరంగా కనిపిస్తుంది. జాసన్ మోయెస్.. ఒక ప్రొఫెషనల్ మత్స్యకారుడు, సిడ్నీకి దక్షిణాన 240 మైళ్ల దూరంలో ఉన్న తన స్వస్థలమైన బెర్మాగుయ్ తీరంలో రహస్య జీవిని పట్టుకున్నాడు.
4 కిలోల బరువున్న ఈ చేప 540 మీటర్ల లోతులో చిక్కుకుందని మత్స్యకారుడు జాసన్ న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు ఈ చేప చిత్రాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఈ చేప ఒక బొచ్చు చేప కావచ్చు అని కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి ఇది సోషల్ మీడియలో వైరల్ అవుతుంది..మీరు ఒకసారి చూడండి.. ఎంత భయంకరంగా ఉందో మీరు చూడండి..