బిగ్ బాస్ 3 పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నటుడు నాగార్జున ఈ సీజన్ కు వ్యాఖ్యాతగా చేసేందుకు ఒప్పుకొని ఏమైనా తప్పు చేశారా అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1, 2 లు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో అందరికీ తెలిసిందే. తొలి సీజన్ లో తారక్ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచగా, రెండో సీజన్‌లో నాని తనదైన శైలిలో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. అయితే త్వరలో ఆరంభం కానున్న మూడో సీజన్ మాత్రం ఇంకా ప్రారంభం కాకముందే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇంకా షో మొదలవకముందే ఆ షో పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
బిగ్ బాస్ 3 లో పాల్గొనేందుకు పలువురు సెలబ్రిటీలకు అగ్రిమెంట్లు ఇచ్చి ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేశారన్న వార్తలు రావడంతో సదరు సెలబ్రిటీలు తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ల బాట పట్టారు. బిగ్ బాస్ 3లో పాల్గొనాలంటే అసలు బాస్‌ను మెప్పించాలని తమతో నిర్వాహకులు అన్నారని.. యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తాలు ఆరోపిస్తూ.. షో పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ షో పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు.
అయితే బిగ్ బాస్ 3 పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నటుడు నాగార్జున ఈ సీజన్ కు వ్యాఖ్యాతగా చేసేందుకు ఒప్పుకొని ఏమైనా తప్పు చేశారా అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏవో నాలుగు సినిమాలు తీసుకోక ఎందుకొచ్చిన తిప్పలు.. అని అభిమానులు అనుకుంటున్నారట. ఇక బిగ్ బాస్ షో కాన్సెప్ట్ తనకు నచ్చదని గతంలోనే చెప్పిన నాగార్జున అసలు ఆ షోలో ఎలా పాల్గొంటున్నారని చాలా మంది నెటిజన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో నాగార్జునను ట్రోల్ చేశారు. ఈ క్రమంలో నాగార్జున బిగ్ బాస్ 3 చేయకుండా ఉంటేనే బాగుంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఈ నెల 21వ తేదీ నుంచే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానున్న నేపథ్యంలో షో పట్ల అన్ని విధాలుగా వస్తున్న ఆరోపణలను నాగార్జున ఎలా తట్టుకుంటూ ముందుకు సాగుతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్‌లో కౌశల్ ఆర్మీ చేసిన లాంటి ఘటనలను రిపీట్ చేయనీయకుండా ఈసారి పకడ్బందీగా బిగ్‌బాస్ షోను నిర్వహించేందుకు స్టార్ మా యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. అయితే షో జరిగే సమయంలో వచ్చే విమర్శలను, వివాదాలను, ఆరోపణలను నాగార్జున ఎలా ఎదుర్కొని షోను ఏవిధంగా ముందుకు నడిపిస్తారో వేచి చూస్తే తెలుస్తుంది..!